అమరనాధ్ శివలింగం వివాదం జటిలం
న్యూఢిల్లీ: అమర్‌నాథ్‌లోని మంచు శివలింగం సహజసిద్ధంగా కాకుండా కృత్రిమంగా తయారు చేయబడిందనే ఆరోపణల నేపథ్యంలో జమ్ము, కాశ్మీర్ గర్నర్ వాస్తవాలను వెలికితీయాలని అదేశించారు. అయితే మంచు శివలింగంపై వచ్చిన ఆరోపణలకు బలం చేకూర్చే సంఘటన మరొకటి జరిగింది. ఢిల్లీకి చెందిన ఐస్ వ్యాపారి ఆర్.ఎస్. యాదవ్ టన్ను డ్రై ఐస్ ఖరీదును తెలపాల్సిందిగా అమర్‌నాథ్ పుణ్యక్షేత్రం బోర్డు తనకు గతంలో ఉత్తరం రాసిందని వెల్లడించాడు. కానీ తాను ఐస్‌ను బోర్డుకు అమ్మలేదని, కేవలం ఖరీదు మాత్రమే తెలియ చేసినట్లు చెప్పాడు. ఒకవేళ ఐస్‌ను అమ్మి ఉంటే శ్రీనగర్ నుంచి బల్‌తాల్ చేర్చాల్సి ఉండేదని యాదవ్ తెలియజేశాడు. దీంతో మంచు శివలింగం ఎత్తును పెంచే ఉద్దేశంతోనే బోర్డు డ్రై ఐస్‌ను ఖరీదు చేయాలనుకుందనే అనుమానాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకవేళ ఇందులో నిజం ఉంటే అగ్నికి ఆజ్యం తోడైన ట్లేనని చెప్పకతప్పదు. సాధారణ ఐస్ లాగా కాకుండా డ్రై ఐస్ నెమ్మదిగా కరుగుతుందని, దీనిని రవాణా చేయడం కూడా సులభమని ఢిల్లీకి చెందిన ఐస్ వ్యాపారి సన్ని అరోరా చె ప్పారు.












Click it and Unblock the Notifications
