సిపిఎం సీనియర్ నేత కొరటాల మృతి
హైదరాబాద్: సిపిఎం సీనియర్ నాయకుడు కొరటాల సత్యనారాయణ (83) శనివారం ఇక్కడ కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. గుంటూరు జిల్లా పేపర్రులో పుట్టిన కొరటాల రేపల్లె నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన 1940 నుంచి కమ్యూనిస్టు ఉద్యమంలో కొనసాగారు. కొరటాల సత్యనారాయణ భౌతిక కాయాన్ని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని ఆయన నివాసంలో ఉంచారు. ఆయన అంత్యక్రియలు ఎల్లుండి జరుగుతాయి. ప్రస్తుతం సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న కొరటాల 1991 నుంచి 1997 వరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. చేనేత, వ్యవసాయ కార్మికుల సమస్యలపై కొరటాల అనేక ఉద్యమాలు నిర్వహించారు.












Click it and Unblock the Notifications
