రౌడీలా వ్యవహరించిన భూమా నాగిరెడ్డి: జిల్లా ఎస్పీ
కర్నూలు: తెలుగుదేశం నాయకుడు, మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడాన్ని కర్నూలు పోలీసు సూపరింటెండెంట్ మల్లారెడ్డి శనివారం ఇక్కడ సమర్ధించుకున్నారు. బాధ్యత గల నాయకుడైన భూమా నాగిరెడ్డి రౌడీలా వ్యవహరించారని, ఇది ఆయనకు తగదని ఎస్పీ అన్నారు. స్ధానిక సంస్ధల ఎన్నికల మొదటి దశ పోలింగ్ జరుగుతుండగా ఆళ్ళగడ్డలో భూమా నాగిరెడ్డి, ఆయన అనుచరులు 40 మంది మారణాయుధాలతో సిఐ నారాయణను, ఇతర పోలీసు సిబ్బందిని బెదిరించారని ఆయన తెలిపారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవలనుకుంటున్న నాయకులపై క ఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఆళ్ళగడ్డలో పోలీసు అధికారులే తప్పు చేశారని భూమా నాగిరెడ్డి ఆరోపించిన విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా, దొంగతనం చేసిన వ్యక్తి అన్నం కోసమే చేశానన్నట్టు ఉందని ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications
