సింగిల్ జడ్జి వ్యాఖ్యలపై పిటిషన్: వైఎస్
హైదరాబాద్: స్ధానిక సంస్ధల ఎన్నికలపై హైకోర్టు సింగిల్ జడ్జి చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని, అవి ప్రజలను ప్రభావితం చేసే అవకాశముందని ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి శనివారం ఉదయం ఇక్కడ వ్యాఖ్యానించారు. ఆ తీర్పుపై వివరణ కోసం హైకోర్టులో పిటిషన్ వేస్తామని ఆయన చెప్పారు. తీర్పు కాపీని తాము ఇంకా చూడలేదని, పత్రికల ద్వారానే ఆ తీర్పు గురించి తెలుసుకున్నామని వైఎస్ తెలిపారు. ఎన్నికల కమిషనర్ నియామకం విషయంలో ఇతర పార్టీలను సంప్రదించాలన్న సంప్రదాయం కానీ నిబంధన కానీ లేదని ఆయన అన్నారు. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు. తాను అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయమే దండగన్న చంద్రబాబు నాయుడు ఏ మొహం పెట్టుకుని గ్రామీణుల ఓట్లు అడుగుతారని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications
