అనుమానంతో గ్రామస్తుడిని చంపిన మావోయిస్టులు
గుంటూరు: పోలీసు ఇన్‌ఫార్మర్ అనే నెపంతో మావోయిస్టులు ఒక వ్యక్తిని హత్య చేశారు. ప్రకాశం జిల్లా పుల్లల చెరువు గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటనలో తక్కెలపాటి నాగేశ్వరావు అనే వ్యక్తి మరణించగా అతని సోదరుడు తక్కెలపాటి వెంకటేశ్వరు తీవ్రంగా ్ల గాయపడ్డారు. వెంకటేశ్వర్లును నరసరావుపేటలోని ఒక ప్రివేటు ఆస్పత్రిలో చేర్చి చికిత్స చేయిస్తున్నారు. శుక్రవారం రాత్రి ఒంటిగంటకు పది మంది మావోయిస్టులు పుల్లలచెరువు గ్రామానికి వచ్చి అన్నదమ్ములను దూరంగా పొలాల్లోకి తీసుకెళ్ళి దాడి చేశారు.












Click it and Unblock the Notifications
