అనుకూల ఓటే మమ్మల్ని గెలిపిస్తుంది: వైఎస్
హైదరాబాద్: ప్రభుత్వ అనుకూల ఓటే కాంగ్రెస్ పార్టీని ఈ స్ధానిక సంస్ధల ఎన్నికల్లో గెలిపిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దీమా వ్యక్తం చేశారు. గత మునిసిపల్ ఎన్నికల కంటే కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని శనివారం ఇక్కడ విలేకరుల సమావేశంలో ఆయన అన్నారు. రెండేళ్ళుగా తాము చేసిన మంచి పనులు రాష్ట్ర ప్రజలపై సానుకూల ప్రభావాన్ని చూపాయని వైఎస్ తెలిపారు. ఎన్నికల సంఘాన్ని విమర్శించడం తెలుగుదేశం పార్టీ దివాళాకోరుతనానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎవిఎస్ రెడ్డి వ్యక్తిత్వం ఎటువంటిదో రాజకీయ పార్టీలన్నిటికీ తెలుసని ఆయన అన్నారు. కోర్టు వ్యాఖ్యలు స్ధానిక ఎన్నికల్లో ప్రజలను ప్రభావితం చేసే అవకాశముందని ముఖ్యమంత్రి అన్నారు.












Click it and Unblock the Notifications
