కరీంనగర్, వరంగల్ జడ్పీలలో కాంగ్రెస్ పాగా
కరీంనగర్: కరీంనగర్, వరంగల్ జడ్పీ చైర్మన్ పదవులను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఈ జిల్లాలో శనివారం జరిగిన ఎన్నికలో కాంగ్రెస్, టి ఆర్ ఎస్‌ల మధ్య విభేదాలు తలెత్తినా జిల్లా నేతలు ఇరు వర్గాల్లో రాజీ చేశారు. దాంతో కాంగ్రెస్ అభ్యర్థి ఆరెవల్లి మోహన్ జడ్పీ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. వైస్ ఛైర్మన్‌గా టిఆర్‌ఎస్ అభ్యర్థి రవీందర్‌గౌడ్ ఎన్నికయ్యారు.
శనివారంనాడు వరంగల్‌లో ఉత్కంఠభరితంగా జరిగిన జడ్పీ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థికే విజయం వరించింది. కాంగ్రెస్‌కు చెందిన లకావత్ ధనవంతి జడ్పీ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. వైస్ ఛైర్మన్‌గా టిఆర్‌ఎస్ అభ్యర్థి ములుగూరి భిక్షపతి ఎన్నికయ్యారు.












Click it and Unblock the Notifications
