ముంబైలో బాంబులపై నకిలీ కాల్స్
ముంబై: బాంబు పేలుళ్లతో అతలాకుతలమైన ముంబె నగరం ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న సమయంలో మళ్ళీ శనివారం రోజు సాయంత్రం ఐదు గంటలకు బాంబులు పేలతాయని బెదిరింపు ఫోన్లు వచ్చాయి. దాంతో అధికార యంత్రాంగం ఆందోళన చెందుతూ లోకల్ రైళ్ళన్నీ నిలిపివేశారు. అన్ని రైల్వే స్టేషన్లను హుటాహుటిన ఖాలీ చేయించారు. బాంబు స్వ్కాడ్‌ను పిలిపించి బాంద్రా స్టేషన్లో తనిఖీలు నిర్వహించారు. ఇతర స్టేషన్లలో జాగిలాలను, బాంబు డిస్పోజబుల్ స్వ్కాడ్‌ను పంపించి తనిఖీలు చేయించారు.
తీరా ఐదు గంటలు దాటిన తర్వాత చూస్తే బాంబులు పేలలేదు. ఎవరో ఆకతాయితనంగా తమను తప్పుతోవ పట్టించడానికే ఈ ఫోన్లు చేశారని పోలీసు యంత్రాంగం నిర్ధారణకు వచ్చింది. ఫోన్ కాల్ చేసేవారిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications
