ఎర్రబోరులో 4గురు నక్సల్స్ మరణించారు: సియం
రాయ్‌పూర్: దంతెవాడ జిల్లా ఎర్రబోరు పునరావాస శిబిరంపై దాడి సందర్భంగా పోలీసుల కాల్పుల్లో నలుగురు నక్సలైట్లు మరణించినట్లు ఛత్తీస్‌ఘడ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ చెప్పారు. ఎర్రబోరు పునరావాస శిబిరంలోని సల్వాజుడుం కార్యకర్తలపై నక్సలైట్ల దాడిలో మరణించినవారి కుటుంబాలకు లక్ష రూపాయలేసి ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆర్మీ హెలికాప్టర్‌ను పంపాలని ఛత్తీస్‌ఘడ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. ఎర్రబోరు పునరావాస శిబిరం పరిస్థితి హృదయ విదారకంగా వుంది.
ఎర్రబోరు ఘటనలో పోలీసుల వైఫల్యమైదీ లేదని ఛత్తీస్‌ఘడ్ పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) ఒ.పి. రాథోడ్ సమర్థించుకున్నారు. నక్సలైట్లను తిప్పికొట్టడానికి పోలీసులు ప్రయత్నించారని ఆయనచెప్పారు. నక్సలైట్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నందున తిప్పికొట్టలేకపోయారని ఆయన అన్నారు. పోలీసుల ఎదురు కాల్పుల్లో కొంత మంది గాయపడ్డారని ఆయన చెప్పారు. నక్సలైట్లు అమాయకులను హత్య చేశారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
