ఎర్రబోరు ఘటన అమానుషం: జానారెడ్డి
హైదరాబాద్: ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంంలోని దంతెవాడ జిల్లా ఎర్రబోరులో నక్సలైట్లు గిరిజనులను చంపడం అమానుషమని రాష్ట్ర హోం మంత్రి కె. జానారెడ్డి అన్నారు. ఈ సంఘటనను ప్రజాస్వామికవాదులందరూ ఖండించాలని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో కోరారు. ఎర్రబోరు ఘటన సభ్య సమాజం సిగ్గుపడాల్సిందని ఆయన అన్నారు. ఎర్రబోరులో తీవ్రంగా గాయపడిన 12 మందిని భద్రాచలం ఆస్పత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు.
ఛత్తీస్‌ఘడ్ ప్రభుత్వం కోరితే అదనపు బలగాలను పంపిస్తామని ఆయన చెప్పారు. క్షతగాత్రులకు వైద్య సేవలు అందిస్తామని ఆయన చెప్పారు. ఒరిస్సా, ఛత్తీస్‌ఘడ్‌లతో సంయుక్త గాలింపు చర్యలు కొనసాగుతాయని ఆయన చెప్పారు. ఎర్రబోరు ఘటన జరిగిన వెంటనే రాష్ట్రంలోని పోలీసులను అప్రమత్తం చేసినట్లు ఆయన తెలిపారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేసినట్లు ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
