ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఎర్రబోడు ఘటన: కర్మ
రాయ్‌పూర్: ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఎర్రబోడు ఘటన చోటు చేసుకుందని సల్వాజుడం నేత మహేంద్ర కర్మ విమర్శించారు. పునరావాస శిబిరాల వద్ద నిరంతరం గస్తీ పెడతామని ప్రభుత్వం చెప్పినప్పటికీ నిజానికి అలా జరడం లేదని ఆయన అన్నారు. ఆయన ఎర్రబోరును సందర్శించడానికి బయలుదేరే ముందు ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
ఎర్రబోరును సందర్శిన తర్వాత తమ తదనంతర కార్యక్రమాన్ని ప్రకటిస్తామని ఆయన చెప్పారు. బస్తర్ ప్రాంతంలోని 250 గ్రామాల్లో సల్వాజుడుం నిర్మాణం ఉంది. నక్సలైట్లపై దాడి చేయడం, గ్రామాల్లోకి రాకుండా వారిని అడ్డగించడం సల్వాజుడుం కార్యకర్తల పని. కాంగ్రెస్ నాయకుడు మహేంద్ర కర్మ వీటిని నిర్మించి వాటికి నాయకత్వం వహిస్తున్నాడు. 30 వేల మందికి పైగా సల్వా జుడుం కార్యకర్తలున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications
