వరంగల్ జిల్లాలో నక్సలైట్ హతం
వరంగల్: వరంగల్ జిల్లా మంగపేట మండలం మల్లూరు గ్రామ శివారులో జరిగిన పోలీసులకు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక నక్సలైటు మరణించాడు. మరణించిన నక్సలైటును సిపియస్‌యుఐ జోనల్ కమిటీ కార్యదర్శి రేణిగుంట్ల రవి అలియాస్ రాజారామ్‌గా గుర్తించారు.
సంఘటనా స్థలం నుంచి ఒక 9 ఎం. ఎం. తుపాకిని, ఒక ద్విచక్ర వాహనాన్ని, 5 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీలు చేస్తున్న పోలీసులకు మోటారు సైకిల్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు తారసపడ్డారు. పోలీసులను చూడగానే వారు కాల్పులు జరిపారు. ప్రతిగా పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎదురుకాల్పుల్లో ఒక నక్సలైట్ మరణించాడు. మరో నక్సలైట్ పారిపోయాడు.












Click it and Unblock the Notifications
