పరిటాల హత్య కేసు చార్జిషీటు అందలేదు: మొద్దు శీను
అనంతపురం: తెలుగుదేశం శాసనసభ్యుడు పరిటాల రవి హత్య కేసులో చార్జిషీటు తమకు ఇంకా అందలేదని నిందితుడు జూలకంటి శ్రీనివాస రెడ్డి అలియాస్ మొద్దు శీను చెప్పాడు. వచ్చే వాయిదా లోగా చార్జిషీటు అందజేస్తామని సిబిఐ అధికారులు చెప్పారు. మద్దెలచెర్వు సూరి, మొద్దు శీనుతో పాటు 13 మంది నిందితులను సిబిఐ అధికారులు సోమవారంనాడు కోర్టులో హాజరు పరిచారు.
నిందితుల రిమాండ్‌ను ఈ నెల 27వ తేదీ వరకు పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తాను చర్లపల్లి జైలులోనే వుంటానని మొద్దు శీను తెలియజేశాడు. కాగా మిగతా 12 మంది నిందితులు తమను అనంతపురం జైలుకు తరలించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయమైన ఈ నెల 24వ తేదీన విచారణ జరుపుతామని కోర్టు తెలియజేసింది.












Click it and Unblock the Notifications
