ఆంధ్ర తీరానికి సునామీ హెచ్చరికలు
హైదరాబాద్: ఆంధ్ర, తమిళ కోస్తా తీరాలకు ప్రాంతీయ సునామీ హెచ్చరిక కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇండోనేషియాలో తీవ్ర భూకంపం చోటు చేసుకున్న నేపథ్యంలో ఈ హెచ్చరికలు జారీ అయ్యాయి. మత్స్యకారులెవరూ సముద్రంలోకి వెళ్లకూడదని ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల అధికారులు ఆదేశించారు. తీరానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండాలని కూడా ఆంధ్రప్రదేశ్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే భారతదేశానికి సునామీ ప్రమాదం ఏదీ వుండదని కేంద్ర మంత్రి కపిల్ సిబాల్ అన్నారు.
ఇండోనేషియాలో సోమవారం ఉదయం 8 గంటల 19 నిమిషాలకు తీవ్ర భూకంపం తాకింది. రిక్టర్ స్కేల్‌పై అది 7.4గా నమోదైంది. ఇండోనేషియాకు సునామీ హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. జావా ద్వీపంలో ఇళ్లు, హోటళ్లు ధ్వంసమయ్యాయి. భూకంపం భయంతో ప్రజలు కొండలపై పరుగెత్తారు.












Click it and Unblock the Notifications
