నందమూరి ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.. మోక్షజ్ఞ సరసన హిట్ బ్యూటీ?
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల ఇటీవల కాలంలో వరుస పరాజయాలతో నిరాశలను ఎదుర్కొంటున్నప్పటికీ.. ఆమెకు మరో బిగ్ ఛాన్స్ తలుపు తట్టినట్లు సమాచారం నందమూరి వారసుడు టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్న మోస్ట్ అవేటెడ్ అరంగేట్ర సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీలను ఎంపిక చేసేందుకు చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ క్యూట్ జోడీ కాంబినేషన్‌పై ప్రస్తుతం చర్చలు శరవేగంగా సాగుతున్నప్పటికీ.. చిత్ర బృందం అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. ఒకవేళ ఈ చర్చలు ఫలించి శ్రీలీల ఓకే చెప్పినట్లయితే.. మోక్షజ్ఞ తొలి సినిమాలో నందమూరి యంగ్ హీరో సరసన ఆమె సందడి చేయనుంది. ఈ ప్రాజెక్ట్ నందమూరి అభిమానుల్లో, తెలుగు సినిమా ఇండస్ట్రీ వర్గాల్లో ఇప్పటికే భారీ అంచనాలను నెలకొల్పింది.

ఈ ప్రతిష్ఠాత్మక సినిమాను 'బింబిసార' ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని దసరా పండుగ సందర్భంగా ఎంతో ఘనంగా ప్రారంభించేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
శ్రీలీలకు తన కెరీర్‌లోని ఈ దశలో ఈ సినిమా ఓ కీలకమైన అవకాశంగా మారనుంది. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయిన వరుస చిత్రాల తర్వాత, ఆమె తన తదుపరి చిత్రంతో ఓ ప్రత్యేక ముద్ర వేయాలని చూస్తోంది .ఒకవేళ ఆమె ఈ ప్రాజెక్ట్‌లో భాగమైతే, శ్రీలీల-మోక్షజ్ఞ జోడీ ఈ ప్రాజెక్టుకు ప్రధాన ఆకర్షణంగా మారడంలో సందేహం లేదు. ప్రస్తుతం ఇది కేవలం టాలీవుడ్ టాక్ గానే ఉన్నప్పటికీ.. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది. ఏది ఏమైనా దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
శ్రీలీల ఖాతాలో అరుదైన రికార్డు
ఇది ఖరారైతే శ్రీలీల ఖాతాలో అరుదైన రికార్డు చేరనుంది. ఈ సినిమాలో నటిస్తే నలుగురు యంగ్ హీరోల డెబ్యూ సినిమాల్లో నటించిన హీరోయిన్ గా రికార్డు తన ఖాతాలో చేరనుంది. ఇప్పటికే శ్రీలీల.. కన్నడ హీరో విరాట్ 'కిస్', రోషన్ మేకా 'పెళ్లి సందడి', కిరీటి రెడ్డి 'జూనియర్' సినిమాల్లో హీరోయిన్గా నటించింది. ఈ ముగ్గురి తొలి సినిమాల్లోనూ ఆమె హీరోయిన్‌గా కనిపించింది. మోక్షజ్ఞ డెబ్యూ మూవీలోనూ శ్రీలీల నటిస్తే.. నాలుగో హీరోను ఇండస్ట్రీకి పరిచయం చేసిన హీరోయిన్‌గా ఆమెకు అరుదైన రికార్డ్ దక్కుతుంది.అయితే మోక్షజ్ఞ కంటే ముందే శ్రీలీల పలువురు స్టార్ హీరోలతో నటించడంతో ఈ కాంబినేషన్‌పై కొందరు నందమూరి అభిమానుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.













Click it and Unblock the Notifications
