ఎన్‌కౌంటర్‌పై అనుమానాలు: హక్కుల నేత శేషయ్య
ఒంగోలు: నల్లమల ఎన్‌కౌంటర్‌పై అనేక అనుమానాలున్నాయని ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం నాయకుడు ప్రొఫెసర్ శేషయ్య అన్నారు. అంత పెద్ద ఎన్‌కౌంటర్ జరిగితే ఇవతలి పక్షం వైపు ఏ విధమైన నష్టం జరగకపోవడం వల్ల అనుమానాలు తలతెత్తుతున్నాయని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
అనుమానాలను నివృత్తి చేయడానికి గుంటూరులో గానీ, హైదరాబాద్‌లో గానీ ఫోరెన్సిక్ నిపుణుల బృందంతో మృతదేహాల పోస్టుమార్టం నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఫోరెన్సిక్ నిపుణులు పోస్టుమార్టం నిర్వహిస్తే కొంత మేరకు నిజాలు బయటపడే అవకాశం వుందని ఆయన అన్నారు. శేషయ్య మరో నలుగురు ప్రజా సంఘాల ప్రతినిధులతో నిజనిర్ధారణ చేసేందుకు సంఘటనా స్థలానికి బయలుదేరారు.












Click it and Unblock the Notifications
