ముంబాయి పేలుళ్లు: మరో ఇద్దరి అరెస్టు
ముంబాయి: ముంబాయి బాంబు పేలుళ్ల కేసులో పోలీసులు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. జమీర్ అహ్మద్, సుహైల్ షేక్ అనే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత జనవరిలో వీరిద్దరూ బాంబు పేలుళ్లకు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. పూణే, ఔరంగాబాద్‌లలో వినాయక చవిత సందర్భంగా విధ్వంసానికి వీరు కుట్ర పన్నినట్లు చెబుతున్నారు. జమీల్‌ను సిమి కార్యకర్తగా గుర్తించారు. సుహైల్, జమీర్‌లు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో శిక్షణ పొందినట్లు పోలీసులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications
