ఇద్దరు ప్రజాప్రతిఘటన కమాండర్ల లొంగుబాటు
ఖమ్మం: ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు ప్రజాప్రతిఘటన దళ కమాండర్లు సోమవారం నాడు ఖమ్మం జిల్లా పోలీసు సూపరింటిండెంట్ (యస్పీ) ఆర్‌పి మీనా ముందు లొంగిపోయారు. ఖమ్మం జిల్లా ములకపల్లి దళ కమాండర్ అయిల రమేష్ అలియాస్ క్రాంతి, పినపాక దళ కమాండర్ సమ్మయ్య అలియాస్ జోగన్న లొంగిపోయారు.
బయ్యారం మండలానికి చెందిన అయిల రమేష్ పాలివాళ్లపై ప్రతీకారంతో ప్రజాప్రతిఘటనలో చేరాడు. రెండు ఎదురుకాల్పుల్లో ఇతను పాల్గొన్నాడని యస్పీ మీనా చెప్పారు. సమ్మయ్య మొదట కొరియర్‌గా పని చేసి ఆ తర్వాత దళంలో చేరాడని, ఆ తర్వాత దళ కమాండర్‌గా నియమితుడయ్యాడని ఆయన చెప్పారు. వీరిద్దరికి నిబంధనల మేరకు పునరావాస సహాయం అందిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
