ఒకే కటుంబానికి చెందిన 7గురి మృతి
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. ఉత్తర ఢిల్లీలోని ఇందర్‌లోక్ ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఓం ప్రకాశ్‌తో పాటు అతని భార్య, ఐదుగురు పిల్లలు మరణించి వుండడాన్ని స్థానికులు సోమవారం ఉదయం గుర్తించారు.
ఓం ప్రకాశ్ కుటుంబ సభ్యులను ఎవరైనా హత్య చేసి వుంటారా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అక్కడి పరిస్థితులు ఈ అనుమానాలకు తావిస్తున్నాయి. అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుని వుండవచ్చుననే అభిప్రాయం కూడా వుంది.












Click it and Unblock the Notifications
