స్థానిక ఎన్నికలు వాయిదా ? బాబు ప్లాన్ ఇదే- జగన్ చెప్పిన లెక్క..!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడబోతున్నాయా ? సీఎం చంద్రబాబు ఇందుకు అనుగుణంగా అడుగులేస్తున్నారా ? దీని వెనుక ఓ కీలక కారణం ఉందా ?.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ (YS Jagan) ఇదే విషయాన్ని పార్టీ నేతలతో భేటీ సందర్భంగా వెల్లడించారు. చంద్రబాబు ఆ ఎన్నికలు పెడతాడో లేదో తెలియదు, కానీ మేకపోతు గాంభీర్యం మాత్రం ప్రదర్శిస్తున్నాడని జగన్ వ్యాఖ్యానించారు. ఎందుకంటే ఆయన నిజంగా స్థానిక ఎన్నికలు పెట్టే వాడే అయితే, బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌ ఇచ్చే వాడు కాదన్నారు.

బీసీ రిజర్వేషన్లకు సంబంధించి గతంలో తాము ఇచ్చిన జీఓను కోర్టు కొట్టేసిందని, అయినా అంతకన్నా ఎక్కువ పదవులు బీసీలకు ఇచ్చామని జగన్ గుర్తుచేశారు. ఆ ప్రభావం ఇప్పుడు కనిపిస్తోందని, ఆ బీసీ రిజర్వేషన్లు తెలంగాణాలోనూ కొట్టేశారని, అందుకే ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరుగుతుందని తెలిసినా చంద్రబాబు డ్రామా చేస్తున్నారని జగన్ ఆరోపించారు. ఎందుకంటే ఈ ఎన్నికలు జరగకూడదు, వాయిదా పడాలన్నదే ఆయన కుట్ర అన్నారు. అలాగే ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ సర్ లో 44 లక్షల ఓట్లు తీసేశారని చెబుతూనే, చంద్రబాబు ఎన్నికలకు ఎలా వెళ్తాడని ఆయన ప్రశ్నించారు.

ys jagan suspects Chandrababu will postpone ap local body elections with this reason

కానీ తాము మాత్రం ఎన్నికలు పెడతారనే అంచనాతోనే ముందుకు వెళ్తున్నట్లు జగన్ తెలిపారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ఎన్నికలు సాఫీగా జరుగుతాయని తాను అనుకోవడం లేదన్నారు. చంద్రబాబు తనను ప్రశ్నించే వాళ్ల గొంతు వినడానికి సిద్ధంగా లేని మనిషి అన్నారు. ఆయన్ను ఎవరు ప్రశ్నించినా వారి మీద అక్రమ కేసులు పెట్టడం, వాళ్ళని పోలీస్‌ స్టేషన్‌ చుట్టూ తిప్పడం, నిర్బంధించడం, ప్రలోభాలు పెట్టడం, దిగజారిన రాజకీయాలు చేయడం చూస్తూనే ఉన్నామని జగన్ తెలిపారు. ఎన్నికలు ఎలా జరిగినా ప్రజలకు తోడుగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉంటుంది అన్న భరోసా మాత్రం కచ్చితంగా ఇస్తామన్నారు. ఎన్నికలు సాఫీగా జరగకపోయినా, ప్రజలకు తోడుగా పోటీలో గట్టిగా మనం నిలబడదామని పార్టీ నేతలకు సూచించారు. ఈ ఎన్నికల కంటే రేపు జరిగే కురుక్షేత్రం ముఖ్యమని, అయితే ఇవి కార్యకర్తల కోసం జరుగుతున్న ఎన్నికలని తెలిపారు. కాబట్టి వారికి అండగా ఉండాలని జగన్ పిలుపునిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+