కుందుర్తిలో బాంబు పేలుళ్లు: ఉద్రిక్తత
హైదరాబాద్: ప్రకాశం జిల్లా సంతమంగులూరు మండలంలోని కుందుర్తి గ్రామంలో నాటుబాంబులు పేలాయి. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ ఇంట్లో ఈ బాంబులు పేలినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇంట్లో 20 నాటుబాంబులు పేలాయి. ఈ పేలుళ్లలో ఇద్దరు గాయపడ్డారు. రంగారెడ్డి జిల్లా బోరకొండ గ్రామంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణలో ఇద్దరు గాయపడ్డారు. వివరాలు మాత్రం బయట పడడం లేదు.
కర్నూలు జిల్లా ఆదోని మండలం గోనబావి గ్రామంలో కాంగ్రెస్, తెలుగుదేశం కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇందులో ఐదుగురు గాయపడ్డారు. గుంటూరు జిల్లా సొలాస గ్రామంలో ఆదివారం పంచాయతీ ఎన్నికల రీపోలింగ్ సందర్భంగా గాయపడినవారిలో ఒక వ్యక్తి మరణించాడు.












Click it and Unblock the Notifications
