పియస్‌యుల విక్రయాన్ని అడ్డుకుంటాం: సిపిఐ
హైదరాబాద్: ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడానికి జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని సిపిఐ రాష్ట్ర కమిటీ కార్యదర్శి కె. నారాయణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని తాము ప్రతిఘటిస్తామని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు.
అవుటర్ రింగ్ రోడ్డు డిజైన్ మార్పుపై, భూసేకరణపై శ్వేతపత్రం విడుదల చేయాలని కూడా ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతోందనే ఆరోపణలపై న్యాయవిచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతోందనేది భారతీయ జనతా పార్టీ (బిజెపి), విశ్వ హిందూ పరిషత్ (విహెచ్‌పి)ల కుట్రేనని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications
