ఢిల్లీ యాక్టివిస్టుకు మెగసెసే అవార్డు
న్యూఢిల్లీ: ఢిల్లీకి చెందిన పరివర్తన్ సంస్థ అధిపతి అర్వింద్ కెజ్రావాల్‌కు ఈ ఏడాది రామన్ మెగసెసే అవార్డు లభించింది. అవినీతిపై పోరాటానికి పేదలను చైతన్యవంతులను చేయడంలో, సమాచార హక్కుపై ప్రజల్లో అవగాహన పెంచడంలో చేసిన కృషికి గాను ఆయన ఈ అవార్డుకు ఎంపికయ్యారు. 38 ఏళ్ల కెజ్రివాల్ ఐఐటి ఖరగ్‌పూర్ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో పట్టా తీసుకున్నాడు. అనంతరం ఆయన 1992లో ఇండియన్ రెవెన్యూ సర్వీసులో చేరారు. ప్రజలను సమాచార హక్కుపై, అవినీతిపై పోరాటం చేయాల్సిన అవసరంపై చైతన్యవంతులను చేయడానికి ఆయన పరివర్తన్ అనే సంస్థను ప్రారంభించారు.
ఆసియా నోబెల్ బహుమతిగా పేరుపొందిన మెగసెసే అవార్డుకు మరో ఐదుగురు కూడా ఎంపికయ్యారు. సందూక్ రూయిత్ (నేపాల్), ఏక్ సోన్ చాన్ (కాంబోడియా), పార్క్ వోన్ సూన్ (దక్షిణ కొరియా), యుజినియా దురాన్ అపొస్టోల్, ఆంటోనియో మెలోటో (పిలిప్పైన్స్) మెగసెసే అవార్డుకు ఎంపికయ్యారు. ఆగస్టు 31వ తేదీన మనీలాలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డులు ప్రదానం చేస్తారు.












Click it and Unblock the Notifications
