రాజకీయాల వల్లనే ప్రాజెక్టుల్లో జాప్యం: సీతాపతి
తిరుపతి: రాజకీయ వివాదాల వల్లనే సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం జరుగుతోందని రాష్ట్ర ప్రభుత్వ నీటి పారుదల శాఖ సాంకేతిక సలహాదారు సీతాపతిరావు అన్నారు. ఆయన సోమవారంనాడు తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కొద్దిసేపు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కొరత లేదని ఆయన అన్నారు.
ప్రాజెక్టులు పూర్తి కాకుండా కొంతమంది వెన్నుపోట్లు పొడుస్తున్నారని ఆయన విమర్శించారు. నిర్వాసితుల పేరు చెప్పి గోదావరి నదిపై తలపెట్టిన పోలవరం ప్రాజెక్టును అడ్డుకుంటుండడాన్ని ఆయన వ్యతిరేకించారు. చైనాలో ఒక ప్రాజెక్టు నిర్మాణం వల్ల పోలవరం వల్ల నిర్వాసితులయ్యే వారికి ఐదు రెట్లు ఎక్కువ మంది నిర్వాసితులయ్యారని ఆయన అన్నారు. దేశానికి దరిద్రం పట్టిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
