తోటి ప్రయాణికుడిపై కన్యాకుమారి రైళ్లో కాల్పులు
విజయవాడ: హౌరా - కన్యాకుమారి ఎక్ప్‌ప్రెస్‌లో మంగళవారంనాడు ఒక వ్యక్తి తోటి ప్రయాణికుడిపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో గాయపడిన సంజయ్ రాహుల్ అనే వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. కాల్పులు జరిపిన ప్రోకాదాస్ అనే వ్యక్తిని ఆర్‌పియఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు.
రైళ్లో సీటు గురించి ఇరువురి మధ్య ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. కోపం పట్టలేని ప్రోకాదాస్ తన వద్ద ఉన్న రివాల్వర్ తీసి సంజయ్ రాహుల్‌పై కాల్పులు జరిపినట్లు సమాచారం. కాల్పులు జరిపి పారిపోవడానికి ప్రయత్నించిన ప్రోకాదాస్‌ను ఆర్‌పియఫ్ పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు కాల్పులు జరిపిన వ్యక్తినే కాకుండా మరో ముగ్గురిని అదుపులోకీ తీసుకున్నారు. దోపిడీ ముఠా ఈ దారుణానికి పాల్పడి వుంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేవలం ఇది ప్రయాణికుల మధ్య గొడవగా సంఘటనను పోలీసులు తీసుకోవడం లేదు.












Click it and Unblock the Notifications
