మెడికల్ పిజి విద్యార్థిపై యాసిడ్ దాడి
కర్నూలు: కర్నూలు మెడికల్ పోస్టు గ్రాడ్యుయేట్ (పిజి) విద్యార్థిపై యాసిడ్ దాడి జరింది. ఈ యాసిడ్ దాడిలో కళ్లకు, చేతులకు గాయాలయ్యాయి. ఈ గాయాలతో గోవింద్ అనే మెడికల్ పిజి విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కళ్లలో యాసిడ్ పడడంతో విద్యార్థి చూపు మందగించే ప్రమాదం వుందని భావిస్తున్నారు. యాసిడ్ పడి కుడి చేయికి గాయమైంది.
కళాశాల నుంచి ఇంటికి వెళ్తున్న గోవింద్‌పై గాయత్రి టవర్స్ వద్ద ఈ యాసిడ్ దాడి జరిగింది. ఒక పదహారేళ్ల కుర్రాడు యాసిడ్ దాడి చేసి సమీపంలోని ఒక ఇంట్లోకి మాయమయ్యాడు.












Click it and Unblock the Notifications
