బస్సు కాలువలో పడి 7గురు పిల్లల మృతి

సోనేపట్‌: హర్యానాలోని సోనేపట్‌ ప్రాంతంలో గల ఆవ్లినా గ్రామ సమీపంలో ఒక స్కూలు బస్సు కాలువలో పడిపోవడంతో ఏడుగురు పాఠశాల పిల్లలు మరణించారు. మరో 32 మంది గాయపడ్డారు. ఈ బస్సులో దాదాపు 41 మంది దాకా పిల్లలు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు 8 శవాలను వెలికి తీశారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా వుంది. పది మందిని సహాయక బృందాలు సజీవంగా వెలికి తీశాయి.

పిల్లలందరూ సోనేపట్‌ దాత్‌ - కుంభ గ్రామంలోని గీతా విద్యామందిర్‌ పాఠశాలకు చెందినవారు. బస్సు పిల్లలతో పాఠశాలకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. బస్సును వెలికి తీయడానికి క్రేన్‌ను తెప్పించారు. కాలువలో నీటిని తగ్గించి సహాయ చర్యలను చేపట్టడానికి నీటి ప్రవాహాన్ని ఆపేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+