ఉద్యోగులను తొలగిస్తే ఆర్టీసి ఉండదు: కృష్ణారావు
హైదరాబాద్: తమ సంస్థ నుంచి 35 వేల మంది ఉద్యోగులను తొలగిస్తే సంస్థనే ఉండదని, తాను ఎండిగా కొనసాగాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎపియస్‌ఆర్టీసి) కృష్ణారావు అన్నారు. ఆదివారం జరిగిన రీజినల్ మేనేజర్ల సమావేశంలో ఆయన ప్రసంగించారు. తమకు మరో ఏడు వేల మంది ఉద్యోగులు అవసరమని ఆయన చెప్పారు. తమ సంస్థ ఉద్యోగులను తొలగించే ఉద్దేశం లేదని ఆయన అన్నారు.
వచ్చే ఏడాది రెండు వేల బస్సులు తీసుకుంటామని, వాటిని నడపడానికి కండక్టర్లు, డ్రైవర్లు కావాలని, అటువంటప్పుడు ఉద్యోగులను తొలగించడమనేది వాస్తవం కాదని ఆయన అన్నారు. తమ సంస్థలో ఉద్యోగులను పెంచుకోవడమే వుంటుంది గానీ తగ్గించుకోవడం వుందని ఆయన స్పష్టం చేశారు. ఆషాఢమాసంలో కూడా ఆర్టీసికి 40 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది.












Click it and Unblock the Notifications
