విద్యార్థి మృతితో భిమిలీలో ఉద్రిక్తత
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా భిమిలీలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మరణించిన సంఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఒక స్కూల్ వ్యాన్ ఢీకొట్టడంతో భిమిలీలో డిగ్రీ చేస్తున్న దుర్గా ప్రసాద్ అనే విద్యార్థి తీవ్రంగా గాయపడ్డారు. అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే దాదాపు రెండు గంటల పాటకు వేచి చూసినా వైద్యులు రాలేదు. దీంతో విద్యార్థి మరణించాడు.
విద్యార్థి మరణంతో ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. విద్యార్థులు ధర్నా చేశారు. సకాలంలో వైద్యం అందించిన డాక్టర్లపై చర్య తీసుకోవాలని విద్యార్థులు ధర్నా చేశారు.












Click it and Unblock the Notifications
