జస్వంత్‌పై రాజ్యసభలో సభా హక్కుల తీర్మానం
న్యూఢిల్లీ: మాజీ విదేశాంగ మంత్రి జస్వంత్ సింగ్‌పై పాండిచ్చేరికి చెందిన కాంగ్రెస్ సభ్యుడు వి. నారాయణ స్వామి బుధవారం రాజ్యసభలో సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ప్రతిపాదించారు. పి.వి. నరసింహారావు ప్రభుత్వ హయాంలో ప్రధాని కార్యాలయంలో గూఢచారి ఉన్నాడంటూ ఆరోపించిన జస్వంత్ సింగ్ చివరకు అతనెవరో తనకు తెలియదని చేతులెత్తేయడంతో నారాయణ స్వామి ఆ తీర్మానాన్ని ప్రతిపాదించారు.
నారాయణస్వామి ప్రతిపాదించిన తీర్మానాన్ని పరిశీలన కోసం రాజ్యసభ చైర్మన్ బైరాన్ సింగ్ షెకావత్ స్వీకరించారు. పరిశీలన అనంతరం షెకావత్ దానిపై నిర్ణయం తీసుకుంటారు. దానిపై రూలింగ్ ఇస్తారు. పివి నరసింహారావు ప్రభుత్వ హయాంలో ప్రధాని కార్యాలయంలో అమెరికా గూఢచారి ఉన్నాడంటూ జస్వంత్ రాసిన రాతలపై గత కొద్ది రోజులుగా తీవ్ర దుమారం చెలరేగుతోంది.












Click it and Unblock the Notifications