శ్రీలంక పోలీసులకు శిక్షణ ఇవ్వరాదు: వైగో
చెన్నై: శ్రీలంక పోలీసులకు మనదేశంలో ఎక్కడా శిక్షణ ఇవ్వరాదని ఎం.డి.ఎం.కె. అధినేత వైగో ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కోరారు. శ్రీలంక పోలీసులకు భారత్‌లో శిక్షణ ఇవ్వడం వల్ల తమిళ ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని శనివారం ప్రధానికి ఫోన్ ద్వారా ఆయన చెప్పారు. అనంతరం వైకో మాట్లాడుతూ, తన విజ్ఞప్తిని తప్పక పరిశీలిస్తానని ప్రధాని హామీనిచ్చారని తెలిపారు. అలాగే శ్రీలంకలోని తమిళ ఎం.పి.లు మన్మోహన్ సింగ్‌ను కలవాలనుకుంటున్నారనే విషయాన్ని కూడా ఆయనకు చెప్పి వారికి అనుమతి ఇవ్వాల్సిందని కోరినట్లు వైకో చెప్పారు.












Click it and Unblock the Notifications