వరంగల్ జిల్లాలో పీరయ్య మృత్యుంజయుడు
వరంగల్: వరంగల్ జిల్లాలోని మున్నేరు వాగు పంప్‌హౌస్‌లో చిక్కుకున్న ఒక వ్యక్తి 48 గంటల తర్వాత సురక్షితంగా బయటపడ్డాడు. వరదలు ముంచెత్తుతున్న సమయంలో మున్నేరు వాగులోని పంప్‌హౌస్‌లో పీరయ్య అనే వ్యక్తి చిక్కుకున్నాడు. అతని బయటకు తీయడానికి స్థానికంగా చేసిన ఎటువంటి ప్రయత్నాలు ఫలించలేదు.
పైగా పీకీరయ్యను రక్షించడానికి ప్రయత్నించిన ఒక యువకుడు కూడా వరదల్లో చిక్కుకున్నాడు. గజ ఈతగాళ్లను రంగంలోకి దించి తాళ్ల సహాయంతో పీరయ్యను బయటకు తీశారు. తాను 48 గంటల పాటు ప్రాణాలను అరచేతిలో పెట్టకుని గడిపానని పీరయ్య చెబుతున్నాడు. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.












Click it and Unblock the Notifications
