పడవ మునిగి 4గురు మృతి, 40 మంది గల్లంతు
చండీఘర్: హర్యానా రాష్ట్రంలో యమునా నదిలో పడవ మునిగి నలుగురు మరణించారు. మరో 40 మంది గల్లంతయ్యారు. ఆదివారం ఉదయం ప్రయాణికులను తీసుకుని వెళ్తున్న పడవ యమునా నదిలో మునిగింది. ఈ ప్రమాదం హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లా మోనా గ్రామం వద్ద జరిగింది.
నదిలో పడిపోయిన నలుగురి మృతదేహాలను సహాయక బృందాలు వెలికి తీశాయి. గల్లంతైనవారి కోసం గజ ఈతగాళ్లను రంగంలోకి దించారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసు, సివిల్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు.












Click it and Unblock the Notifications
