ఇన్‌ఫార్మర్‌ నెపంతో ఒకరిని చంపిన నక్సల్స్‌

వరంగల్‌: వరంగల్‌ జిల్లాలో ఇన్‌ఫార్మర్‌ అనే నెపంతో మావోయిస్టులు ఒక వ్యక్తిని హత్య చేశారు. వరంగల్‌ జిల్లా కొత్తూరు మండలం తిరుమలగండి మండలంలో వెంకన్న అనే వ్యక్తిపై మావోయిస్టులు దాడి చేశారు. ఈ దాడిలో వెంకన్న తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా అతను మరణించాడు.

సంఘటనా స్థలం వద్ద మావోయిస్టులు ఒక లేఖను వదిలివెళ్లారు. పోలీసులకు ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరించినందుకే వెంకన్నను చంపామని, ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరించేవారు ఎవరైనా వారికి ఇదే గతి పడుతుందని ఆ లేఖలో మావోయిస్టులు హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+