వరదలతో నష్టం కన్నా మేలు ఎక్కువ: రఘువీరా
హైదరాబాద్: ప్రస్తుత వర్షాల వల్ల నష్టం కన్నా మేలే ఎక్కువగా జరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి ఎన్. రఘువీరా రెడ్డి అన్నారు. వరదల వల్ల పంటలు ఎక్కువగా నష్టపోలేదని, పండ్లతోటలు మాత్రమే దెబ్బ తిన్నాయని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
వరదల వల్ల 8 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ఆయన తెలిపారు. పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి 600 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ఆయన చెప్పారు. అరటి మొక్కలు 70 శాతం సబ్సిడీలు అందిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
