మంత్రి జెసి తమ్ముడిపై కేసు నమోదు

అనంతపురం: రాష్ట్ర మంత్రి జెసి దివాకరరెడ్డి సోదరుడు, తాడిపత్రి మునిసిపల్‌ చైర్మన్‌ జెసి ప్రభాకరరెడ్డిపై మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు. తాడిపత్రి మండలం చుక్కలూరు గ్రామంలో కాంగ్రెస్‌ నాయకుడు సజీవదహనమైన నేపధ్యంలో మంగళవారం ఆ గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్ధితి నెలకొంది. గ్రామంలో ఉద్రిక్తతను తగ్గించడానికి అక్కడికి పోలీసు దళాలు పెద్ద ఎత్తున తరలి వెళ్ళాయి. అక్కడికి వచ్చిన మంత్రి సోదరుడు జెసి ప్రభాకరరెడ్డి తమ విధులను అడ్డుకున్నారంటూ ఆ గ్రామంలో శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్న సిఐ శ్రీనివాసులు తాడిపత్రి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+