త్రివర్ణ పతాకాన్ని ఎగరేసిన మన్మోహన్‌

న్యూఢిల్లీ: గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రధానమంత్రి డాక్టర్‌ మన్‌ మోహన్‌ సింగ్‌ మంగళవారం ఉదయం ఎర్రకోటపై మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. త్రివిధ దళాలు గౌరవవందనం సమర్పించగా ప్రధాని జైహింద్‌ అంటూ జెండాకు గౌరవ వందనం చేశారు. అనంతరం ఆయన ఎర్ర కోటపైనుంచి జాతినుద్దేశించి ప్రసంగిస్తూ దేశం మరింతగా ముందుకు పయనించవలసి ఉందని అన్నారు. టెర్రరిస్టులు శాంతి భద్రతల సమస్యను సృష్టించే ప్రమాదం ఉందని ముందుగా అందిన సమాచారం ప్రకారం పోలీసులు అన్ని చోట్ల గట్టి భద్రత అమలు చేశారు. ఈ నేపథ్యంలో దేశానికి ప్రధాన సమస్య టెర్రరిజం నుంచి, నక్సలిజం నుంచి ఎదురవుతున్నదని ఆయన అన్నారు.

ఈ రెండు సమస్యలనూ ఉపేక్షించేది లేదని ప్రధాని గట్టిగా చెప్పారు. అలాగే టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్న ఇరుగుపొరుగు దేశాలకు కూడా ఒక హెచ్చరికగా ప్రధాని ప్రసంగం సాగింది. ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే ప్రధాని మంగళవారంనాడు కాస్త గట్టిగానే మాట్లాడారు. దేశంలో సంస్కరఇలు మరింతగా అమలు కావలసి ఉందని కూడా ఆయన అన్నారు. ఇరుగుపొరుగు దేశాలతో సఖ్యంగా ఉండడమే భారతదేశానికి ఇష్టమని చెబుతూ ఆయన ఎవ్వరూ గీత దాటకూడదని కూడా హె చ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+