నెల్లూరు ఆస్పత్రి నుంచి పసికందు మాయం
నెల్లూరు: నెల్లూరులోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో రెండు రోజుల పాప మాయమైంది. నెల్లూరు జిల్లా అమ్మోరుపాలెం గ్రామానికి చెందిన నిర్మల అనే మహిళ రెండు రోజుల క్రితం పసిపాపకు జన్మనిచ్చింది. గురువారం రాత్రి పాప ఏడుస్తుండటంతో తాను సముదాయిస్తానని ఒక మహిళ ఆ పాపను తీసికెళ్లిందని, ఆ మహిళ తనను శ్రీకాకుళం జిల్లాకు చెందిన సుశీలగా పరిచయం చేసుకుందని నిర్మల చెబుతోంది. ఆస్పత్రివర్గాల నిర్లక్ష్యం వల్లనే పాప పోయిందని నిర్మల బంధువులు విమర్శిస్తున్నారు.
ఇంతకు ముందు ఈ ఆస్పత్రి నుంచి ఒక పసి బాబు కూడా మాయమయ్యాడు. కానిస్టేబుల్ కుమారుడిని ఎవరో ఎత్తుకెళ్లారు. అయితే ఆ బాబు తిరిగి దొరికాడు. అయితే పసికందు మాయం కావడంలో తమ నిర్లక్ష్యం ఏమీ లేదని ఆస్పత్రి వర్గాలంటున్నాయి. ఇంత ఆస్పత్రికి ఒకే వాచ్‌మన్ వున్నాడని, అందువల్ల రోగులు ఎవరి జాగ్రత్తలో వారు ఉండాల్సిన అవసరం వుందని ఆస్పత్రి వర్గాలు వాదిస్తున్నాయి.












Click it and Unblock the Notifications
