తెరాస నేతలు బయటకు వస్తారు: విజయశాంతి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌పై కాంగ్రెస్ ఉద్దేశ్యపూర్వకంగానే నానుస్తోందని తల్లి తెలంగాణ పార్టీ నాయకురాలు, సినీ నటి విజయశాంతి విమర్శించారు. తెలంగాణలోని వరద తాకిడి ప్రాంతాల్లో పర్యటనకు బయలుదేరే ముందు ఆమె శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అగ్రనేతలు కె. చంద్రశేఖరరావు, ఎ. నరేంద్ర ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) ప్రభుత్వం నుంచి బయటకు రావాలని ఆమె డిమాండ్ చేశారు.
తెలంగాణపై కాంగ్రెస్ తేల్చకపోతే యుపిఎ నుంచి బయటకు వస్తామని చెప్పిన మాటలను తెరాస నేతలు ఈసారి నిలబెట్టుకుంటారనే నమ్మకం తనకుందని ఆమె అన్నారు. తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ఇదివరకు చాలా సార్లు మోసం చేసిందని, ఈసారి మోసపోవడానికి సిద్ధంగా లేరని ఆమె అన్నారు. కాంగ్రెస్‌కు తెలంగాణ ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్తారని ఆమె హెచ్చరించారు. వరద తాకిడి ప్రాంతాల్లో తన పర్యటనను విజయశాంతి వరంగల్ జిల్లాలోని తన స్వగ్రామం రామన్నగూడెం నుంచి ప్రారంభిస్తారు.












Click it and Unblock the Notifications
