ఛూ మంతర్ అంటే తెలంగాణ రాదు: కెకె
న్యూఢిల్లీ: ఛూమంతర్ అంటే తెలంగాణ రాదని, ప్రచారాలు, పోరాటాలతో తెలంగాణ రాష్ట్రం రాదని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు అన్నారు. అందరూ కలిసి వస్తేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యమవుతుందని ఆయన అన్నారు. తెరాసకు బలం లేదని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెరాస పది అసెంబ్లీ సీట్లు, ఒక లోక్‌సభ సీటు గెలిస్తే ఎక్కువని ఆయన అన్నారు.
సెట్లరా, నాన్ సెట్లరా అనేది ముఖ్యం కాదని, తెలంగాణ పట్ల అంకితభావం ముఖ్యమని ఆయన అన్నారు. కేశవరావు తెలంగాణ స్థానికులు కాదని తెరాస నాయకుడు ఎ. నరేంద్ర అన్నారు. దానిపై కేశవరావు తీవ్రంగా ప్రతిస్పందించారు. అసలే నరేంద్ర వీక్ వికెట్ అని, ఏదేదో మాట్లాడుతుంటారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
