గౌరుకు క్షమాభిక్ష కేసు: సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ శాసనసభ్యురాలు గౌరు చరితారెడ్డి భర్త గౌరు వెంకటరెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన క్షమాభిక్ష కేసుపై విచారణను సుప్రీంకోర్టు రిజర్వు చేసుకుంది. ఈ కేసులో వాదప్రతివాదనలు ముగిశాయి. ఈ కేసులో వాదప్రతివాదులు కోర్టుకు ఏమైన చెప్పదలుచుకుంటే సోమవారంనాడు రాతపూర్వకంగా ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించింది. ఇటువంటివే 75 పిటిషన్లు వున్నందున వాటికి కూడా వర్తించేలా తీర్పు ప్రకటించాలనేది సుప్రీంకోర్టు ఆలోచనగా కనిపిస్తోంది. గౌరు వెంకటరెడ్డికి క్షమాభిక్ష పెట్టిన సంఘటనపై సుప్రీంకోర్టు బుధవారంనాడు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. గౌరు వెంకటరెడ్డికి క్షమాభిక్ష పెట్టిన ఫైలుపై అప్పటి గవర్నర్ సుశీల్ కుమార్ షిండే కళ్లు మూసుకుని సంతకం చేశారా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
వెంకటరెడ్డికి క్షమాభిక్ష పెట్టడానికి కర్నూలు జిల్లా యస్పీ, కలెక్టరు పంపిన నివేదికలు తప్పుల తడకగా వున్నాయని, వీరి నివేదికల ఆధారంగా క్షమాభిక్ష పెట్టడం చూస్తే ఫైలుపై గవర్నర్ కళ్లు మూసుకుని సంతకం చేశారేమోనని అనిపిస్తోందని న్యాయమూర్తులు అరిజిత్ వసాయత్, కపాడియాలతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ అన్నది. గవర్నర్ ఫైలును సరిగా చూడనే లేదని అభిప్రాయపడిందని అభిప్రాయపడింది. కేవలం రాజకీయ కారణాలతో ఏదో విధంగా వెంకటరెడ్డికి క్షమాభిక్ష పొందాలన్న తాపత్రయమే ప్రభుత్వంలో కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. క్షమాభిక్ష పెట్టే విషయంలో ఆయా ప్రభుత్వాలు మార్గదర్శక సూత్రాలు రూపొందించుకోవాలని సూచించింది.












Click it and Unblock the Notifications
