భవిష్యత్తు వ్యూహంపై కెసిఆర్ మంతనాలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె. చంద్రశేఖర రావు గురువారంనాడు పార్టీ పార్లమెంటు సభ్యులతో, శాసనసభ్యులతో సమావేశమయ్యారు. భవిష్యత్తు కార్యక్రమాన్ని రూపొందించడానికి, సెప్టెంబర్ 8వ తేదీన జరిగే సిద్ధిపేట సభను విజయవంతం చేయడానికి అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన వారితో చర్చలు జరిపారు.
తమ ఉద్యమం నూటికి నూరు శాతం శాంతియుతంగా జరుగుతుందని పార్టీ శాసనసభ్యుడు నాయని నర్సింహారెడ్డి అంటున్నారు. ఇప్పటి వరకు శాంతియుత పద్ధతిలోనే తమ ఉద్యమం సాగిందని, ఇప్పుడు కూడా అలాగే సాగుతుందని ఆయన అన్నారు. సిద్ధిపేట బహిరంగ సభ తమ ఉద్యమంలో మైలురాయి కాగలదని ఆయన అన్నారు. ఈ సభ అనంతరం కెసిఆర్ రథయాత్ర కార్యక్రమాన్ని ఖరారు చేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
