ఆమ్‌వే గోదాముల సీజ్: సరుకుల స్వాధీనం
హైదరాబాద్: అంతార్జతీయ మార్కెటింగ్ నెట్‌వర్క్ సంస్థ ఆమ్‌వే కార్యాలయాలపై సిఐడి అధికారులు మంగళవారంనాడు కూడా దాడులు నిర్వహించారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలోని గోదాములను అధికారులు సీజ్ చేశారు. తమను మోసం చేస్తోందనే ఆరోపణలు రావడంతో పోలీసులు ఆమ్‌వేపై కేసు నమోదు చేశారు. దీంతో సిఐడి అధికారులు సోమవారంనాడు ఆమ్‌వే కార్యాలయాలపై దాడులు ప్రారంభించారు.
మంగళవారంనాడు సిఐడి అధికారులు పది జిల్లాల్లోని కార్యాలయాలను సీజ్ చేశారు. ఆమ్‌వేకు చెందిన ఐదు కోట్ల రూపాయల విలువ చేసే సరుకులను స్వాధీనం చేసుకున్నారు. విలువైన డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆమ్‌వై యజమానులపై ఆర్థిక నేరాల కింద కేసు నమోదు చేశారు. ప్రజలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సిఐడి అధికారులు విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications
