కరీంనగర్ ఎన్నికలో సమస్యలే ప్రధానం: బాబు
హైదరాబాద్: కరీంనగర్ లోక్‌సభ ఉప ఎన్నికలో తెలంగాణ అంశం కన్నా ప్రజా సమస్యలు ప్రధానంగా పని చేస్తాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. అర్థం లేకుండా కరీంనగర్ ఉప ఎన్నిక తెలంగాణకు రెఫరెండం అంటున్నారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి ప్రజల సమస్యలను పట్టించుకోలేదని ఆయన అన్నారు.
కరీంనగర్ ఉప ఎన్నిక తెలంగాణపై రెఫరెండం అనే కాంగ్రెస్, తెరాస మాటల్లోని అర్థమేమిటని అడిగారు. కరీంనగర్ లోక్‌సభ పరిధిలోని ప్రజలకు చాలా సమస్యలున్నాయని, ఆ సమస్యలన్నీ ఎన్నిక ఫలితంపై ప్రభావం చూపుతాయని ఆయన అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము తెలంగాణలో మంచి ఫలితాలు సాధించామని, కరీంనగర్ ఉప ఎన్నికలోనూ దాన్ని పునరావృతం చేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
