పేలుళ్ల కేసు: యస్‌ఐ సహా ఐదుగురు దోషులు
ముంబాయి: 1993 వరుస బాంబు పేలుళ్ల కేసులో రాయఘడ్ జిల్లా శ్రీవర్ధన్ పోలీసు స్టేషన్ అప్పటి సబ్ ఇన్‌స్పెక్టర్ (యస్‌ఐ) విజయ్ పాటిల్‌ను టాడా కోర్టు మంగళవారం దోషిగా నిర్ధారించింది. సస్పెండ్ అయిన మరో నలుగురు కానిస్టేబుళ్లను కూడా కోర్టు దోషిగా నిర్ధారించింది. బాంబు పేలుళ్లకు జరిగిన కుట్రలో పాలుపంచుకున్నందుకు కోర్టు వారిని దోషులుగా నిర్ధారించింది. ఈ కేసులో ముగ్గురు కానిస్టేబుళ్లను నిర్దోషులుగా ప్రకటించింది.
ముంబాయికి ఆయుధాలు, పేలుడు పదార్థాలు ఏ ఆటంకం లేకుండా చేరడానికి పాటిల్ ఆయుధాలు, మందుగుండు సామగ్రి గల ట్రక్‌ను రాయఘడ్ జిల్లా ఘోంద్‌గార్ మీదుగా అనుమతించాడనేది ఆరోపణ. పాటిల్ నాలుగున్నరేళ్ల పాటు కస్టడీలో ఉన్నాడు. ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నాడు. అరెస్టయిన వెంటనే పాటిల్‌ను సస్పెండ్ చేశారు. తీర్పు కోసం పాటిల్ కోర్టుకు రప్పించి వెంటనే కస్టడీలోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications
