తెలంగాణ సాధించుకుందాం: కేశవరావు
హైదరాబాద్: తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, తెలంగాణ రాష్ట్రం సాధించుకుందామని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు అన్నారు. తెలంగాణ విద్యార్థుల సంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మంగళవారంనాడు ప్రసంగించారు. తెలంగాణ అభివృద్ధితో తెలంగాణ రాష్ట్ర సాధనకు సంబంధం లేదని ఆయన అన్నారు.
తెలంగాణ అభివృద్ధి అనేది తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యామ్నాయం కాదని, మన అస్తిత్వం కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవసరమని ఆయన అన్నారు. తెలంగాణ అభివృద్ధి జరిగినప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవసరం వుంటుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
