శంతన్‌పై కాల్పుల కేసు: మరొకరు లొంగుబాటు
విజయవాడ: కాంగ్రెస్ మాజీ శాసనసభ్యుడు వంగవీటి చలపతిరావు కుమారుడు వంగవీటి శంతన్ కుమార్‌పై కాల్పుల కేసులో మరో నిందితుడు మంగళవారంనాడు లొంగిపోయాడు. శ్యామ్ అనే నిందితుడు విజయవాడ మూడో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు లొంగిపోయాడు. అతనికి వచ్చే నెల 9వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు.
శంతన్‌కుమార్‌పై ఇటీవల కోర్టు ఆవరణలో కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. తెలుగుదేశం నాయకుడు కాట్రగడ్డ బాబు శంతన్‌కుమార్ హత్యకు కుట్ర చేసినట్లు భావిస్తున్నారు. శ్యామ్‌ను పోలీసులు తమ కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరే అవకాశాలున్నాయి. శ్యామ్ వెల్లడించే అంశాలు కేసులో అతి ప్రధానం కాగలవని వారు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications
