1993 పేలుళ్ల కేసులో మరో ఇద్దరు దోషులు
ముంబాయి: 1993 వరుస బాంబు పేలుళ్ల కేసులో ఇద్దరు ప్రధాని నిందితులను టాడా కోర్టు గురువారం దోషులుగా నిర్ధారించింది. అభియోగాలను రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైనందున ఒక వ్యక్తిని కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. పాకిస్థాన్‌లో ఆయుధ శిక్షన పొందినందుకు, కుట్ర కోసం జరిగిన సమావేశంలో పాల్గొన్నందుకు నసీర్ అబ్దుల్ కాదర్ కేవల్ అలియాస్ నసీర్ ధాక్యాను, మొహ్మద్ రఫీక్ ఉస్మాన్ షేక్‌ను టాడా కోర్టు దోషులుగా నిర్ధారించింది.
పేలుళ్లకు ముందు కోస్తా రాయఘడ్ జిల్లాకు ఆయుధాలను, పేలుడు పదార్థాలను చేరవేసినందుకు కూడా నసీర్‌ను కోర్టు దోషిగా నిర్ధారించింది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో నిలిపి వాహనాల్లో ఆర్‌డియక్స్ నింపాడనే ఆరోపణపై ససీర్‌ను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. కోర్టు వారి ఒప్పుకోళ్లను, సహనిందితులు ఇచ్చిన సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకుంది. ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరించాడని, పాకిస్థాన్‌లో ఆయుధ శిక్షణ పొందడానికి సహ నిందితులకు సహకరించడాని అభియోగాలు ఎదుర్కున్న మొహ్మద్ అహ్మద్ మన్సూర్‌ను కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది.












Click it and Unblock the Notifications
