చండీఘడ్‌కు ఆర్టీసి ఎండి కృష్ణారావు బదిలీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎపియస్ ఆర్టీసి) మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణారావు చండీఘడ్‌కు బదిలీ అయ్యారు. ఆయనను కేంద్ర సాయుధ పోలీసు బలగాల (సిఆర్‌పియఫ్) ఆపరేషన్ డైరెక్టర్‌గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆర్టీసి కార్మిక సంఘాలు సమ్మె నోటీసు ఇచ్చిన నేపథ్యంలో ఆయన బదిలీ జరగడం చర్చనీయాంశంగా మారింది. ఈ స్థితిలో కృష్ణారావును బదిలీ చేయడం తగదని కార్మిక సంఘాలు అంటున్నాయి. కృష్ణారావు బదిలీని అనుమతించకూడదని కార్మిక సంఘాలు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి.
తమ వేతనాల సవరణను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాలు సమ్మె నోటీసు ఇచ్చాయి. ఈ నెల 18వ తేదీ తర్వాత ఎప్పుడైనా కార్మిక సంఘాలు సమ్మెకు దిగే అవకాశాలున్నాయి. ఈ స్థితిలో కృష్ణారావును బదిలీ చేయడం వల్ల ఆర్టీసి పరిస్థితి అస్తవ్యస్తమయ్యే సూచనలు కనిపిస్తున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications
