ఇద్దరు మిలిటెంట్లు, 4గురు జవాన్లు మృతి
శ్రీనగర్: శ్రీనగర్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మిలిటెంట్లతో పాటు నలుగురు భద్రతా బలగాల సిబ్బంది మరణించారు. బుధవారంనాడు శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌లో ప్రారంభమైన ఎన్‌కౌంటర్ దాదాపు 24 గంటల పాటు సాగి గురువారంనాడు ముగిసింది. ఈ ఎన్‌కౌంటర్‌లో 17 మంది గాయపడ్డారు. గాయపడినవారిలో నలుగురు పౌరులు ఉన్నారు.
హోటల్‌లోకి చొరబడి బయటకు రావడానికి ప్రయత్నించిన ఇద్దరు ఆల్ మన్సూరియన్ మిలిటెంట్లను భద్రతా బలగాలు కాల్చి చంపాయి. హోటల్ లోపలి నుంచి ఏ విధమైన కాల్పులు జరగడం లేదని, అందువల్ల ఎన్‌కౌంటర్ ముగిసిందని అనుకుంటున్నామని భద్రతా బలగాల అధికారి ఒకరు చెప్పారు. మృతుల్లో ఒక జవాను, ఇద్దరు స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ అధికారులు, ఒక జమ్మూ కాశ్మీర్ పోలీసు ఉన్నారు. భద్రతా బలగాలు గాలింపు జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications
